Sunday, December 22, 2024

సిఎం రేవంత్ రెడ్డితో సిపిఎం నేతల భేటీ

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య టక్కఫర్ పోరు నడుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఎం నేతలు శనివారం భేటీ అయ్యారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీతారాములు, వీరయ్య సిఎం రేవంత్ నివాసంలో కలిశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ భేటీ జరగడం రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం నేతలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై చర్చించే అవకాశముంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News