Sunday, December 22, 2024

సిపిఎం నేతలు సీఎం రేవంత్ ను ఎందుకు కలిశారంటే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిపిఎం ముఖ్య నేతలు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. లోక్ సభ స్థానాల్లో మద్దతివ్వాలని సిపిఎం నేతలను రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిపారు. భువనగిరి లోక్ సభతో పాటు ఇతర స్థానాల్లో మద్దతు కోరామని చెప్పారు. మరికొన్ని రాజకీయ ప్రతిపాదనలు సిపిఎం ముందుంచామని వెల్లడించారు. కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు సిపిఎం నేతలు అంగీకరించారని తెలిపారు.

దేశంలోనూ ఇండియా కూటమితో కలిసి పనిచేయనున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకట్రెండు విషయాల్లో సిపిఎంతో సందిగ్ధత ఉందన్న సిఎం అధిష్టానంతో చర్చించి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తామన్నారు. సిపిఎం సహకారంతో భవిష్యత్తులో ముందుకెళ్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కలయిక కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తోందని భావిస్తున్నానని తెలిపారు.

అటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ.. తమ అభ్యర్థులను బరిలో నుంచి విరమించుకోవాలని సిఎం కోరారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బిజెపి, ఇతర శక్తులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ మద్దతునిస్తున్నట్లు తమ్మినేని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News