Saturday, November 9, 2024

సిపిఎంకు షాక్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సిపిఎంకు గట్టి షాక్ తగిలింది. సిపిఎం పోలిట్ బ్యూరో పదవికి సీనియర్ నేత బివి రాఘవులు రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత కుమ్ము లాటలు, వరుస ఫిర్యాదుల నేపథ్యంలోనే రాఘవులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సభ్యత్వం మినహా అన్ని పదవులకు ఆయన రిజైన్ చేసినట్లు సమాచారం. అయితే రాఘవులు రాజీనామాను పార్టీ పొలిట్ బ్యూరో ఆమోదించలేదు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయనను పార్టీ నాయకులు బుజ్జగిస్తున్నట్లు సమాచారం.

పార్టీ నిర్మాణం, కేడర్ నియామకం విషయంలో పొలిట్ బ్యూరో సభ్యులకు, రాఘవులుకు మధ్య భిన్నాభిప్రా యాలు రావడమే ఆయన రాజీనామాకు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. సిపిఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేస్తూ క్రమేణా కీలకంగా రాఘవులు ఎదిగారు. పార్టీలో రాఘవులు పలు ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. సిపిఎం సంస్థాగత నిర్మాణంలో కీలకంగా వ్యవహరిం చారు. జాతీయస్థాయిలోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News