Sunday, December 22, 2024

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. ఖమ్మంలో తన నివాసంలో ఉన్న సమయంలో ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో ఆయనను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తమ్మినేనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారి సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం తమ్మినేనిని హైదరాబాద్‌లోని ఎఐజి ఆసుపత్రికి తరలిం చారు. తమ్మినేని ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రెండు రోజులుగా ఆయన ఖమ్మంలోని ఉన్నారు. ఖమ్మంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
హెల్త్ బులెటిన్ విడుదల
తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై ఎఐజి ఆసుపత్రి యాజమాన్యం బులెటిన్ విడుదల చేసింది. ‘తమ్మినేని వెంటిలేటర్ సపోర్ట్‌తో ఖమ్మం నుంచి ఎఐజికి వచ్చారు. ఆయన గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం మందులతో చికిత్స అందిస్తున్నాం. ఆయన ఊపరితిత్తుల్లో నుంచి నీరు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాం. వివిధ విభాగాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన ఎక్కువగా మీడియాలో కనిపించారు. కాంగ్రెస్‌తో పొత్తు విషయంపై పలుమార్లు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ చివరి వరకు నాన్చుడు ధోరణి వహించిందని, కోరిన స్థానాలు ఇవ్వలేదని ఆగ్రహం చెందారు. ఆ తర్వాత సిపిఎం సొంతంగా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. తమ్మినేని వీరభద్రం మూడో స్థానానికి పరిమి తం అయ్యారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సిఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ఇక సిపిఐ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తులోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి విదితమే.
తమ్మినేనిని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు
ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంని మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ హరీష్‌రావు పరామర్శించారు. తమ్మినేని ఆరోగ్యపరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమ్మినేని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News