Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో సిపిఎం సానుభూతిపరుడి మృతి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం రూరల్ : మండలంలోని ఆరేంపుల గ్రామం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిపిఎం సానుభూతిపరుడు భట్టి రాజేష్ (30) మృతి చెందాడు. స్థానికులు, రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన భట్టి రాజేష్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే సుబ్లేడ్ గ్రామం నుంచి ఖమ్మం వస్తుండగా ఆరేంపుల వద్దకు రాగానే ఖమ్మం వైపు నుంచి వరంగల్ వైపు వెళుతున్న కారు అతివేగంగా వచ్చి రాజేష్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి, మరో టీవీఎస్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.

దీంతో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేష్ మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజేష్ మృతదేహాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావులు సందర్శించి నివాళులర్పించారు. మృతునికి భార్య, 9 నెలల కుమారుడు ఉన్నారు. రాజేష్ పార్దీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, వై.విక్రమ్, జిల్లా నాయకులు మాదినేని రమేష్, షేక్ బషీరుద్దీన్, జబ్బార్, మీరా, కొమ్ము శ్రీను తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News