Monday, January 20, 2025

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సిపిఆర్ ట్రైనింగ్

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులకు రెడ్ క్రాస్ సొసైటీ నాగర్‌కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సెక్రటరి రమేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాగర్‌కర్నూల్ జిల్లా రెడ్ క్రాస్ సేవలు ముందంజలో ఉన్నాయని, జూనియర్, యూత్ రెడ్ క్రాస్ ఆక్టివిటీస్‌లో తెలంగాణ రాష్ట్రంలోనే మన జిల్లా ఆక్టివిటిస్ ప్రథమ స్థానంలో ఉన్నామని అన్నారు.

రెడ్ క్రాస్ వాలంటీర్లందరికి ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్ ట్రైనింగ్ అందిస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల విద్యార్థిని విద్యార్థులకు ఫస్ట్ ఎయిడ్‌తో పాటు సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం చేస్తూ సేవా భావం పెంపొందించాలని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ఆదేశించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మొబైల్ మెడికల్ యూనిట్ రాష్ట్ర కో ఆర్డినేటర్ స్వర్ణలత మాట్లాడుతూ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సేవలు విస్తృతంగా అందిస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర శాఖ సహకారంతో విద్యార్థులకు సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం కల్పిస్తూనే ప్రథమ చికిత్స అందించేలా ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సరిత, రెడ్ క్రాస్ యూత్ కన్వీనర్ డి. కుమార్, మేనేజింగ్ కమిటీ సభ్యులు కృష్ణ రావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News