Friday, December 20, 2024

ఎపిలో గ్రూప్స్ ఉద్యోగాలకు సిపిటి సర్టిఫికెట్ తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్స్ ఉద్యోగ నియామకాల నిబంధనల్లో మార్పులు చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ సర్టిఫికెట్ (సిపిటి) తప్పనిసరి చేశారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ సర్వీసుల కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎపిపిఎస్‌సి లేదా ఎపి సాంకేతిక విద్యాబోర్డు నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియెన్స్ టెస్టు పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సిపిటి పాస్ సర్టిఫికెట్ లేకుండా నియామకానికి అవకాశం లేదంటూ అడ్‌హాక్ నిబంధనల్లో పేర్కొన్నారు.

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులయ్యే వారంతా సిపిటి పాస్ కావల్సిందేనని స్పష్టం చేశారు. వంద మార్కులకు సిపిటి నిర్వహించడం జరగుతుందని, ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగ అభ్యర్ధులు కనీసం 30 మార్కులు సాధించాల్సి ఉంటుందని సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. అలాగే బిసిలు 35 మార్కులు, ఓసీలు 40 మార్కులు సాధించాల్సివుందని తెలిపింది. కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు, వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ అంశాల్లో పరీక్ష ఎదుర్కోవల్సి ఉంటుందని వెల్లడించింది. గ్రూప్ ఒన్ సర్వీసు ఉద్యోగలకు తాత్కాలికంగా ఈ నిబంధన వర్చించదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News