Monday, December 23, 2024

కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడి మునిమనవడు

- Advertisement -
- Advertisement -

చెన్నై : ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడు, భారత చివరి గవర్నర్ జనరల్ సి. రాజగోపాలాచారి మునిమనవడు సిఆర్ కేశవన్ శనివారం బీజేపీలో చేరారు. దక్షిణాదిలో మరింతగా విస్తరించాలని బీజేపీ లక్షంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే దక్షిణాదికి చెందిన ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకుంటోంది. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న కేశవన్ బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

ఈ చేరికతో కాంగ్‌స్‌క్రు మరోషాక్ తగిలినట్టు అయింది. కేంద్ర మంత్రి వికే సింగ్ , బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి అనిల్ బలూనీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రజా కేంద్రీకృత విధానాలు, అవినీతి రహిత, సమ్మిళిత పాలన నచ్చే బీజేపీలో చేరినట్టు కేశవన్ వెల్లడించారు. దేశానికి రాజగోపాలాచారి చేసిన కృషి గురించి కేశవన్ మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయనను పక్కన పెట్టారని ఒకే కుటుంబం తామే అన్నీ చేశామని చెప్పేందుకు యత్నించిందని పరోక్షంగా నెహ్రూ, గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి విమర్శించారు. ప్రస్తుతం బీజేపీలో చేరిన కేశవన్ తమిళనాడులో ఆ పార్టీకి బలంగా మారతారని అనుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News