- Advertisement -
- నలుగురి అరెస్టు
- యాంటి నార్కొటెక్ బ్యూరో ఎస్పి చక్రవర్తి
పటాన్ చెరు: అక్రమంగా తరలిస్తున్న గంజాయి మూఠను రాష్ట్ర యాంటి నార్కొటెక్ బ్యూరో ఎస్పి చక్రవర్తి , పటాన్‌చెరు సిఐ లాలునాయక్‌లు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే విశ్వసనీయ సమాచారం మేరకు పటాన్ చెరు మండల పరిధిలోని ముత్తంగి ఔటర్ రింగ్ వద్ద తనికీలు నిర్వహిస్తుండగా ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా చింతలపల్లి ఏజెన్సి ప్రాంతంలో సాగు చేసి ముంబాయికి అక్రమంగా శాంట్రో కారులో రవాణా చేస్తున్న 90 కిలోల ఎండు గంజాయిని రాజారావు 35, వంతల బాబ్జీ 25, శ్రీనివాస్ కుమార్ 28, రాథోడ్ 34ల నుంచి స్వాధీనం చేసుకున్నారు.అక్రమంగా తరిస్తున్న వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టుగా తెలిపారు. ఈ తనిఖీల్లో టిఎస్‌ఎన్‌ఏబి రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -