Saturday, November 23, 2024

శంకరాచార్య పీఠంలోని శివలింగానికి పగుళ్లు !

- Advertisement -
- Advertisement -

జోషిమఠ్: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఉన్న జోషిమట్‌లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మా భగవతి మందిరంను కొండచరియ దెబ్బతీశాక, ఇప్పుడు శంకరాచార్య మాధవ్ ఆశ్రం మందిరంలోని శివలింగంలో పగుళ్లు చోటుచేసుకున్నాయి. పైగా మందిరంలోని భవనంలో కూడా పగుళ్లు చోటుచేసుకున్నాయి. లక్ష్మీ నారాయణ్ మందిరం చుట్టూ ఉన్న భవన సమాదాయంలో కూడా పగుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ భవనసముదాయంలో తోతకాచార్య గుహ, త్రిపుర సుందరి రాజరాజేశ్వరి మందిరం, జ్యోతిష్ పీఠంలోని శంకరాచార్య పీఠం ఉంది.

జోషిమఠ్‌లో వినాశనం చూసి నిపుణుల బృందం కూడా ఆశ్చర్యపోతోంది. నగరంలోని కట్టడాల్లో పగుళ్లు ఎందుకు ఏర్పడుతున్నాయో నిర్ధారించడంలో మొదటి రోజున నిపుణులు కూడా విఫలమయ్యారు. గోడలు, తలుపులు, నేల, డజన్ల కొద్దీ ఇళ్లలో పగుళ్లు చోటుచేసుకున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు నెట్‌లో విరివిగానే ఉన్నాయి. కాగా శంకరాచార్య గద్ది స్థల్‌లో దర్శనమిస్తున్న దృశ్యాలు అందరినీ వేధిస్తున్నాయి. జోషిమఠ్‌లో కొండచరియలు విరగడంపై జోషిమఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి చింతను వ్యక్తం చేశారు. ‘జ్యోతిర్‌మఠం కూడా ప్రకృతి విపత్తులో చిక్కుకుంది’ అన్నారు. కొండచరియలు విరిగిపడ్డం ద్వారా బాధితులైన కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే సాయపడాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి పునరావాస కల్పన ఏర్పాట్లు కూడా చూడాలన్నారు. ఏడాదిపాటుగా భూమి కుంగుతున్నప్పటికీ సకాలంలో దానిని ఎవరూ పట్టించుకోలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News