Thursday, January 23, 2025

రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం..ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగరంలోని ఫేమస్ టూరిస్ట్ ప్లేస్‌లలో ఒకటైన రామోజీ ఫిల్మ్ సిటీ లో ఘోర ప్రమాదం సంభవించింది. క్రేన్ కూలి ప్రమాదం విస్టెక్స్ కంపెనీ సిఇఒ సంజయ్ షా మృతి చెందారని సమాచారం. చైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. విస్టెక్స్ కంపెనీ రామోజీ ఫిల్మ్ సిటీలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఏర్పాటు చేసింది. కంపెనీ చైర్మన్ విశ్వనాథరాజు, సిఇఒ సంజయ్ షా, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ అంతలోనే ఊహించని ప్రమాదం జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలోని లైమ్లైట్ గార్డెన్ లో ఒక్కసారిగా క్రేన్ కూలడంతో విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

అయితే చనిపోయిన వ్యక్తి విస్టెక్స్ కంపెనీ సిఇఒ సంజయ్ షా అని సమాచారం. గాయపడిన చైర్మన్ విశ్వనాథరాజును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లైమ్ లైట్ గార్డెన్‌లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి ముందు కంపెనీ సిఇఒ సంజయ్ షా, చైర్మన్ విశ్వనాథరాజు క్రేన్ మీదుగా కిందికి దిగుతుండగా ఒక్కసారిగా క్రేన్ వైర్లు తెగిపోయినట్లు తెలుస్తోంది. చైర్మన్, సిఇఒతో పాటు పలువురు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో కంపెనీ సిఇఒ సంజయ్ షా మృతిచెందారు. గురువారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News