Thursday, January 23, 2025

రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం

- Advertisement -
- Advertisement -

Crash of Alliance Air flight was narrowly avoided

 

న్యూఢిల్లీ /జబల్‌పూర్ : అలయన్స్ ఎయిర్ విమానానికి ప్రమాదం తృటిలో తప్పింది. ఢిల్లీ నుంచి 55 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం శనివారం విమానాశ్రయం వద్ద దిగుతుండగా రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) దర్యాప్తు ప్రారంభించింది. శనివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి 55 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో బయలుదేరిన ఎటిఆర్ 72 విమానం మధ్యాహ్నం 1.15 గంటలకు జబల్‌పూర్ నగరానికి 21 కిమీ దూరంలో ఉన్న దుమ్నా విమానాశ్రయంలో ల్యాండింగ్ అయినప్పుడు ఈ సంఘటన జరిగింది. విమానాశ్రయంలో ఆపరేషన్స్ నాలుగైదు గంటల పాటు ఆపేసిన తరువాత మళ్లీ ప్రారంభించామని ఎయిర్ పోర్టు డైరెక్టర్ కుసుం దాస్ చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News