- Advertisement -
ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మాణంలో ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి ‘క్రేజీ ఫెలో’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఆది పోషిస్తున్న పాత్రకు తగ్గట్టు ఈ టైటిల్ ని ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. టైటిల్‌కి తగినవిధంగా ఈ చిత్రంలో ఆది విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. టైటిల్ పోస్టర్ కూల్ అండ్ క్లాస్‌గా ఆకట్టుకుంది. పూర్తి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన దిగంగన సూర్యవంశీ, మర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
- Advertisement -