- Advertisement -
ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీసత్యసాయి ఆర్ట్‌లో ఫణికృష్ణ దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘క్రేజీ ఫెలో’. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘క్రేజీ ఫెలో’ టైటిల్‌కి తగ్గట్టే ట్రైలర్ చాలా క్రేజీగా ఉంది. ఫ్యామిలీ, ఫన్, రోమాన్స్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్‌తో సినిమాపై ఆసకిని పెంచింది ఈ ట్రైలర్. ట్రైలర్‌లో ఆది స్టయిలీష్ లుక్స్, యాక్షన్‌తో అలరించాడు. ఆతని కామిక్ టైమింగ్ అద్భుతంగా ఉంది. హీరోయిన్లు దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ అందంగా కనిపించారు. ఈ నెల 14న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ట్రైలర్ ద్వారా ప్రకటించారు నిర్మాతలు.
‘Crazy Fellow’ movie trailer released
- Advertisement -