Monday, December 23, 2024

‘క్రేజీ ఫెలో’లో ‘రన్ రాజా రన్’ ఫ్లేవర్ కనిపిస్తోంది

- Advertisement -
- Advertisement -

Crazy fellow pre release event

 

మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్… యంగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్‌లో ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో నిర్మించిన యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ క్రేజీ ఫెలో. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. ఈనెల 14న ఈ సినిమా విడుదలవుతున్న నేపధ్యంలో హైదరాబాద్‌లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. హీరో శర్వానంద్ ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ “క్రేజీ ఫెలో మూవీలో ‘రన్ రాజా రన్’ ఫ్లేవర్ కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే మంచి ఎంటర్‌టైనర్ అనిపిస్తోంది. ‘క్రేజీ ఫెలో’ పెద్ద సక్సెస్ కావాలి”అని అన్నారు.

ఆది సాయికుమార్ మాట్లాడుతూ “క్రేజీ ఫెలో… హిలేరియస్ ఎంటర్‌టైనర్. మంచి ఎమోషన్ కూడా వుంటుంది. కథని బలంగా నమ్మి చేశాం. దర్శకుడు ఫణి కృష్ణ చాలా అద్భుతమైన కథని రెడీ చేశారు. నిర్మాత రాధామోహన్ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. ద్రువన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు” అని తెలిపారు. నిర్మాత రాధమోహన్ మాట్లాడుతూ “ఈ కథకి ఆది చక్కగా సరిపోయాడు. మిర్నా ఈ సినిమాతో తెలుగులో అడుగుపెడుతోంది. దర్శకుడు ఫణి కృష్ణకి మంచి భవిష్యత్ వుంది. తను ఏం చెప్పాడో అదే తీశారు. క్రేజీ ఫెలో… మంచి ఎంటర్‌టైనర్‌”అని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు ఫణి కృష్ణ మాట్లాడుతూ “ఆది ఈ సినిమాలో కొత్తగా వుంటారు. ఈ సినిమా కోసం చాలా క్రేజీగా పని చేశాం”అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్ నంది, మారుతి, మిర్నా మీనన్, ద్రువన్ కాసర్ల శ్యామ్, రామకృష్ణ, అనీష్ కురివిల్లా, వినోదిని వైద్యనాధన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News