Friday, November 22, 2024

‘క్రేజీ అంకుల్స్’ సినిమా నిలిపివేయాలి: మహిళా సంఘాల డిమాండ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/పంజాగుట్ట: మహిళలను కించ పరిచే విధంగా రూపొందించిన క్రేజీ అంకుల్స్ సినిమా విడుదలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్ష కార్యదర్శులు రేఖ, రత్నాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్ లోనే మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. మహిళలను ఆట వస్తువుగా చూపిస్తూ, అసభ్య పద జాలంతో కూడిన సినిమా రూపిందించడం సరికాదు అన్నారు.

కేవలం ట్రైలర్‌లోనే అంత అసభ్యత ఉంటే.. ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించవచ్చు అన్నారు. గతంలో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయని, కేవలం డబ్బు సంపాదన కోసమే యావత్ మహిళ జాతిని కించపర్చడం అన్యాయమన్నారు. వెంటనే సినీ నిర్మాత, దర్శకులు, నటీనటులు యావత్ మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పి సినిమా విడుదలను నిపివేయాల్లి అని హెచ్చరించారు. లేకుంటే యావత్ తెలుగు రాష్ట్రాల మహిళా ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చెప్పారు.

‘Crazy Uncles’ film should be stopped: Women’s Association

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News