Thursday, December 26, 2024

కల్కి 2 నుంచి క్రేజీ అప్డేట్

- Advertisement -
- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘కల్కి 2898’. ఈ మూవీ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో చెప్పాల్సిన పని లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్ళింది ఈ మూవీ. కాగా, మూవీ సీక్వెల్ గా ‘కల్కి 2’ మూవీ త్వరలో రాబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులుకు ఓ కీలక అప్డేట్ ను చిత్ర నిర్మాతలు అందించారు.

తాజాగా గోవాలో జరుగుతున్న ఇఫ్ఫీ వేడుకలలో తెలుగు సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఇందులో పలువురు టాలీవుడ్ తారలు, టెక్నీషియన్స్, మూవీ మేకర్స్ హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే వేడుకలకు కల్కి మూవీ నిర్మాతలు స్వప్న దత్తు- ప్రియాంక దత్తు లు కూడా హాజరయ్యారు. ఈ సమయంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. కల్కి పార్ట్ 2 కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతుందని, పార్ట్ 2 కు సంబంధించిన షూటింగ్ 35 శాతం షూటింగ్ పూర్తయిందంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. పార్ట్ 2 రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు మూవీ మేకర్స్.

కల్కి పార్ట్ 1 సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా, వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వని దత్ నిర్మించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 1000 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. కాగా, ఈ భారీ బడ్జెట్ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పడుకొనే, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ వంటి స్టార్లు నటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News