విజయమే కాదు భారీ మెజారిటీ సాధించాలి
విపక్షాల నోళ్లు మూతపడాలి
ఉపఎన్నికపై మంత్రులు హరీష్, గంగుల, అభ్యర్థి గెల్లుతో సమీక్షలో కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయం సాధించడమే కాదు.. భారీ మెజార్టీని ద క్కించుకోవాలని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిశానిర్దేశం చేశారు. ఈ విజయంతో విపక్షాల నోళ్లు మూతపడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందన్నారు. ఈ నేపథ్యం లో నియోజకవర్గ ప్రజలంతా మనతోనే ఉన్నారన్నారు. అయి తే ప్రతి ఓటు చాలా విలువైందన్న విషయాన్ని పార్టీ నేతలు దృ ష్టిలో పెట్టుకుని పనిచేయాలని సూచించారు. ఎన్నికల నోటిఫి కేషన్‌కు ఇంకా సమయమనన్న నేపథ్యంలో పార్టీ నేతలు ఏ చిన్న అలసత్వాన్ని తమ దరిచేరనివ్వవద్దని వ్యాఖ్యానించిన ట్లుగా తెలుస్తోంది. శుక్రవారం ప్రగతి భవన్‌లో మంత్రులు హ రీశ్‌రావు, గంగుల కమలాకర్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తో పాటు కరీంనగర్ జిల్లా, నియోజకవర్గానికి చెందిన పలు వురు ముఖ్యనేతలతో హుజూరాబాద్ ఉప సిఎం కెసి ఆర్ సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. నియోజకవర్గంలో ప్రజలు ఓట్లు వన్‌సైడ్‌గా టిఆర్‌ఎస్‌కే పడే విధంగా పనిచేయాల న్నారు. ఇటీవలే నియోజకవర్గంలో ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందన్న విషయంపై ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆరా తీశారని తెలుస్తోంది. ము ఖ్యంగా దళితవర్గాలు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నాయి? అన్న అంశంపై కూడా పార్టీ నేతలను సిఎం అడిగి తెలుసుకున్నా రు. కాగా వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి నేతన్నలకు చేయూత పథకం సైతం ప్రారంభిస్తున్నామన్నారు. దళిత వర్గాలతో పా టు వర్గాలకు చెందిన ఓట్లు కూడా మనకే పడే విధంగా నేత లు ప్రచారం చేయాలని సూచించారు.
గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదు
విపక్షాల బలాలు, బలహీనతలపై కూడా దృష్టి సారించాల న్నారు. విపక్షాలు ఎన్ని అబద్దాలు చెప్పినా బలపం క ట్టుకుని తిరిగినా టిఆర్‌ఎస్ గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు. నియోజవకర్గంలోని అన్ని వర్గాల ప్రజలు టిఆర్‌ఎస్ పాలన పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారన్నారు. తన కొచ్చిన నివేదికల ఆధారంగా ఇప్పటివరకు హుజూరాబాద్ లో కారు జెట్ స్పీడ్‌తో ముందుకు సాగుతోందన్నారు. విపక్షా లకు డిపాజిట్లు దక్కడం సిఎం చినట్లుగా తెలుస్తోంది. పార్టీ శ్రేణులు ఇదే స్ఫూర్తి, ఉత్సాహాన్ని ఎన్నికలు ముగిసేంతవరకు కొనసాగించాలని చారు. అవసరమైతే నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పా టు చేసుకుందామని సిఎం పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
పార్టీ పక్షాల
త్వరలోనే ఎన్నికల బూత్‌ల వారీగా సమీక్ష చేయాలని పార్టీ నేతలకు సిఎం కెసిఆర్ సూచించారని సమాచారం. మరికొద్ది రోజుల్లోనే పార్టీ పక్షాల పలు కమిటీలను ఏర్పాటు చేయనున్న ట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రతి నా యకుడి పనితీరును తానే స్వయంగా పర్యవేక్షించనున్నట్లు ఈ సందర్భంగా సిఎం చేసినట్లుగా తెలుస్తోంది.