Sunday, December 22, 2024

కృత్రిమ మానవ పిండాల సృష్టి

- Advertisement -
- Advertisement -

సాధారణంగా వీర్యకణాలు, అండం కలయికతో పిండం ఏర్పడుతుంది. అయితే వీర్యకణాలు, గర్భాశయం అవసరం లేకుండానే శాస్త్రవేత్తలు కృత్రిమ పిండాన్ని సృష్టించారు. ప్రపంచం లోనే మొట్టమొదటి సింథటిక్ (కృత్రిమ ) పిండాలను మూల కణాలను ఉపయోగించి శాస్త్రవేత్తలు సృష్టించారు. ఇదో గొప్పమలుపు. మనిషి అభివృద్ధి మొదటి దశలను పోలిన ఈ కృత్రిమ పిండాలు జన్యుపరమైన అవలక్షణాలను, జీవసంబంధ సమస్యలను పరిష్కరించడానికి వీలు కలిగిస్తాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఎలుకల మూల కణాలను ఉపయోగించి పేగులు, అభివృద్ధి చెందుతున్న మెదడు, కొట్టుకుంటున్న గుండె వంటి నిర్మాణాలతో సమర్ధంగా పిండాలను రూపొందించ గలిగారు. వీర్యం, అండాలతో కూడిన ఫలదీకరణ ప్రక్రియ అవసరం లేకుండానే ఇందులో విజయం సాధించారు.

మొత్తానికి ఎలుకల నుంచి సేకరించిన మూలకణాలు ఈ నిర్మాణాలను సొంతంగా సమీకరించగలవని కనుగొన్నారు. సృష్టికి ప్రతిసృష్టి చేయాలనే ప్రయత్నాలలో ఇజ్రావాయెల్ శాస్త్రవేత్తలు అద్భుతాన్ని ఆవిష్కరించారు. వీర్యకణాలు, గర్భాశయం అవసరం లేకుండానే కృత్రిమ పించాన్ని సృష్టించారు. ఓ చిన్న పాత్రలో ఓ సింథటిక్ పొరను ఏర్పర్చి, అందులోనే మహిళ గర్భం లోని వాతావరణాన్ని కల్పించి, కేవలం రక్త కణాల తోనే ఓ పిండాన్ని అభివృద్ధి చేశారు. ఇందులోనే కణజాలం అభివృద్ధి చెందడంతోపాటు శరీర భాగాలు కూడా ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ విధంగా కృత్రిమ పిండాన్ని రూపొందించడం ప్రపంచం లోనే మొదటిసారి. మానవ కణజాలాన్ని, శరీర భాగాలను కృత్రిమంగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నాలకు ఈ ప్రయోగం మరింత ఊతం ఇస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

జర్నల్ సెల్‌లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురించారు. పిండం కదలికలను పరిశీలించడానికి మూలకణాలను రీప్రోగ్రామింగ్ చేసే సమర్ధవంతమైన ఎలక్ట్రానిక్ విధానాన్ని శాస్త్రవేత్తల బృందం ఉపయోగించింది. మావి (ప్లాసెంటా)కి రక్త ప్రవాహం ద్వారా పోషకాలు సరఫరా చేసే విధానాన్ని అవలంబించారు. “ ఇప్పటివరకు చాలా అధ్యయనాల్లో ప్రత్యేకమైన కణాలు తరచుగా ఉత్పత్తి చేయడం కష్టం లేదా అసహజంగా ఉంటాయి. అవి మార్పిడికి అనువైన బాగా నిర్మాణాత్మక కణజాలానికి బదులుగా మిశ్రమాలను ఏర్పరుస్తాయి.

మూల కణాలలో ఎన్‌కోడ్ చేసిన స్వీయ సామర్ధాన్ని ఆవిష్కరించడం ద్వారా మేం ఈ అడ్డంకులను అధిగమించగలిగామని వైజ్‌మాన్ మాలిక్యులర్ జెనెటిక్స్ విభాగం ప్రొఫెసర్, అధ్యయనానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జాకబ్ హన్నా చెప్పారు. పరిశోధకులు మూలకణాలను మూడు గ్రూపులుగా విభజించారు. ఒకటి పిండం అవయవాలుగా అభివృద్ధి చెందడానికి ఉద్దేశించింది కాగా, మిగతా రెండింటి జన్యువులలో ఒకదానిని ప్లాసెంటా లేదా అండాలు ఎక్కువగా స్పందించేలా 48 గంటలు ముందుగా పరిశీలించారు. ఎలక్ట్రానిక్ నియంత్రణ లో ఉన్న పరికరంలో మిళితం చేసిన వాటిలో దాదాపు 10,000లో కేవలం 0.5 శాతం లేదా 50 గోళాలను ఏర్పరిచాయి.

వీటిలో ప్రతి ఒక్కటి తరువాత పిండం లాంటి నిర్మాణంగా మారాయి. పిండాల వెలుపల ఏర్పడే ప్లాసెంటా , పచ్చసొన సంచులను గమనించిన పరిశోధకులు సహజ పిండం వలె ఉన్నట్టు తెలిపారు. ఎలుక 20 రోజుల గర్భధారణలో దాదాపు సగం వరకు 8.5 రోజులు సింథటిక్ పిండాలు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. ఈ దశలో ప్రారంభ అవయవాలు ఏర్పడ్డాయి. ఇందులో కొట్టుకునే గుండె, రక్తమూలకణ ప్రసరణ, ఆకారంలో ఉన్న మడతలు కలిగిన మెదడు, ఒక నాడీ ట్యూబ్, పేగు మార్గం ఏర్పడినట్టు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News