Friday, December 20, 2024

29వ తేదీ నుంచి మే 01వ తేదీ వరకు క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో

- Advertisement -
- Advertisement -

ఈనెల 29వ తేదీ నుంచి మే 01వ తేదీ వరకు
క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో


మనతెలంగాణ/హైదరాబాద్:  క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో ఈనెలాఖరులో మూడురోజుల పాటు నిర్వహించనున్నట్టు క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణా రావు, జనరల్ సెక్రటరీ, రాజశేఖర్ రెడ్డిలు పేర్కొన్నారు. 11వ ఎడిషన్ క్రెడాయ్ హైదరాబాద్ ప్రోపర్టీ షో 2022ను మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఈనెల 29 నుంచి మే 01 వరకు నిర్వహించనున్నట్టు వారు తెలిపారు. ఈ ప్రదర్శనలో ప్రతి ఒక్కరి అవసరాలు, బడ్జెట్స్‌కు తగినట్లుగా డెవలపర్లు ప్రోపర్టీలను ప్రదర్శించనున్నామన్నారు. తద్వారా వినియోగదారులకు జంట నగరాల్లో అత్యుత్తమ గృహ పరిష్కారాలను పొందే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ ప్రదర్శనలో కేవలం టిఎస్-రెరా అనుమతి పొందిన ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, గ్రీన్ బిల్డింగ్స్ వంటివి రిటైల్, వాణిజ్య కాంప్లెక్స్, ఓపెన్ ప్లాట్స్ మొదలైనవి ప్రదర్శనలో ఉంటాయన్నారు. వీటితో పాటుగా ప్రదర్శనకు వచ్చి కొనుగోలు పట్ల ఆసక్తి చూపే వారికి బ్యాంకులు,ఆర్థిక సంస్థలు తగిన మద్దతు ఇస్తాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News