Thursday, November 14, 2024

పండుగ ఖర్చు మామూలుగా లేదు

- Advertisement -
- Advertisement -

అక్టోబర్‌లో క్రెడిట్ కార్డుల ఖర్చు రూ.1.78 లక్షల కోట్లు,  నెలవారీ ప్రాతిపదికన 25.4 శాతం పెరిగింది

న్యూఢిల్లీ : ఈసారి పండుగ సీజన్‌లో ప్రజలు షాపింగ్‌లు, ఇతర ఖర్చులు భారీగా పెంచారు. చాలా కాలంగా నిర్మానుష్యంగా ఉన్న మార్కెట్లు కళకళలాడాయి. ప్రజలు బయట షా పింగ్‌లకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకున్నారు. ఓ వైపు వినియోగదారుల జే బులు ఖాళీ అయితే, మరోవైపు కం పెనీలు భారీ లాభాలను ఆర్జించా యి. ఈ కాలంలో ప్రజలు క్రెడిట్ కా ర్డ్‌తో కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జ రిపారు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ కొనుగోళ్లు కొత్త రికార్డులను సృ ష్టించాయి. ఆర్‌బిఐ(భారతీయ రిజ ర్వ్ బ్యాంక్) నివేదిక ప్రకారం, అక్టోబర్‌లో క్రెడిట్ కార్డ్‌ల ఖర్చు సంవత్సరానికి 38.3 శాతం పెరిగి గరిష్ట స్థా యి రూ. 1.78 లక్షల కోట్లకు చేరుకుంది. గత 9 నెలల్లో ఇదే అతిపెద్ద వృద్ధి, నెలవారీ ప్రాతిపదికన 25.4 శాతం పెరిగింది. నవంబర్ గణాంకాలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

ఇ-కామర్స్ షాపింగ్ జోరు
అక్టోబర్‌లో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల లో క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోళ్లు 30 శాతం పెరిగి రూ.1.2 ట్రిలియన్లకు చేరుకున్నాయి. ఈ కాలంలో పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ వద్ద క్రెడిట్ కార్డ్ వినియోగం 16 శాతం పెరిగి రూ.57,774 కోట్లకు చేరుకుంది. అక్టోబర్‌లో సగటున ఒక్కో క్రెడిట్‌కు రూ.18,898 ఖర్చు చేశా రు. దాదాపు 16 శాతం పెరిగింది. 65 శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్ కోసం క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఇందులోనూ ఆన్‌లైన్ టి కెట్ బుకింగ్‌కే అత్యధిక వాటా దక్కింది. నో కాస్ట్ ఇఎంఐ సదుపాయాన్ని ప్రవేశపెట్టిన తర్వాత క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది.

నంబర్ వన్‌గా ఎస్‌బిఐ కార్డ్
అక్టోబర్‌లో ఎస్‌బిఐ కార్డ్ 42 శాతం వృద్ధితో అన్నింటి కన్నా ముందు వ రుసలో ఉంది. ఈ బ్యాంకు కార్డుల ద్వారా వినియోగదారులు రూ.35 వేల కోట్లకు పైగా లావాదేవీలు జరిపారు. ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా 35 శాతం చొ ప్పున లావాదేవీలు నిర్వహించారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా 17 శాతానికి పైగా లావాదేవీలు జరిగాయి. ఈ కాలంలో సిటి కార్డ్ వినియోగం కూడా పెరిగింది. చాలా వరకు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, దుస్తుల కొనుగోళ్లు జరిగా యి. ఈ కాలంలో మొత్తం క్రెడిట్ కా ర్డుల సంఖ్య కూడా 9.47 కోట్లకు పెరిగింది.

ఆర్‌బిఐ నిబంధనల ఎఫెక్ట్
రాబోయే కాలం క్రెడిట్ కార్డ్‌లకు చా లా కష్టంగా ఉండే అవకాశం ఉంద ని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చే స్తున్నారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించి బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలపై ఆర్‌బిఐ విధించిన కఠిన నిబంధనల కారణంగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. రిస్క్ వెయిట్‌ని పెంచడం ద్వారా ఆర్‌బిఐ సమస్య సృష్టించింది. అయితే రానున్న కాలంలో యుపిఐ ద్వారా క్రెడిట్ కార్డుల వినియోగం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News