సాగుయోగ్యమైన ప్రతి ఎకరాకు రైతుభరోసా
26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
అమలు 4 పథకాల అమలుపై ప్రతి గ్రామంలో
గ్రామసభలు నిర్వహించాలి 24లోగా గ్రామసభలు
పూర్తి చేయాలి 26 నుంచి జిల్లాల్లో పర్యటిస్తా.. ఆకస్మిక
తనిఖీలు చేస్తా సాగుకు యోగ్యం కాని భూములకు
భరోసా వద్దు స్థిరాస్తి భూములు, లేఔట్లు, నాలా
కన్వర్షన్ అయిన భూములు, మైనింగ్ భూములు,
గోదాములు నిర్మించిన భూములకు భరోసా ఇవ్వవద్దు
గ్రామపంచాయితీ, మున్సిపాలిటీ రికార్డులను పరిశీలించి
సాగుకు యోగ్యంగాని భూములను పక్కాగా నిర్ధారించాలి
రాబోయే రోజుల్లో వన్ రేషన్..వన్ స్టేట్ విధానం
కలెక్టర్ల సమావేశంలో సిఎం రేవంత్‌రెడ్డి నాలుగు
పథకాలకు మార్గదర్శకాలు జారీ వాటికి అనుగుణంగా
లబ్ధిదారుల ఎంపిక : డిప్యూటీ సిఎం భట్టి పథకాల
అమలు బాధ్యత కలెక్టర్లదే : మంత్రి పొంగులేటి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఈ నెల 26వ తేదీ నుంచి పర్యటించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఆయా జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో అధికారులను కూడా అప్రమత్తం చే యాలని కలెక్టర్లను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మహిళా ఐఏఎస్ అ ధికారులతో పాటు ఐపిఎస్ అధికారులు కూడా నెలలో ఒక్కసారైనా బాలికల హాస్టల్స్‌ను విజిట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్కడే రాత్రి బస చేయాలన్నారు. విద్యార్థుల అవసరాలను, ఏమైనా సమస్యలుంటే తెలుసుకొని పరిష్కరించాలని సిఎం సూచించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. సచివాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సిఎం రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్త మ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృ ష్ణారావు, సీతక్క, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్ర భుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పా టు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సదస్సులో పా ల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలు, ఆయా పథకాలకు అవసరమైన వివరాల సేకరణ, లబ్ధిదారుల జాబితాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ పేదల సంక్షే మం, రాష్ట్ర అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందనే నమ్మకం, విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందని ఆయన అన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ, కులగణన సర్వేను విజయవంతంగా పూర్తి చేసినందుకు కలెక్టర్లను సిఎం అభినందించారు. ప్రభు త్వం చేపట్టే కార్యక్రమాలు, అమలు చేసే పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేది కలెక్టర్లేనని ఆయన సూచించారు. కొంతమంది కలెక్టర్లు ఇప్పటికీ ఆఫీసుల్లోనే కూర్చొని పని చేయాలనుకుంటున్నారని, క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లాలని గతంలో చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
26వ తేదీన కొత్త పథకాలు ప్రారంభం…
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలైనందున ఈ జనవరి 26వ తేదీన జరిగే గణతంత్ర వేడుకలకు అత్యంత ప్రాధాన్యముందని, అదే రోజున అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాల అమలుకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతు భరోసాను ఎకరానికి రూ.12 వేలకు పెంచటంతో పాటు, భూమి లేని నిరుపేద కూలీ కుటుంబాలకు ఏటా రూ.12 వేల నగదు సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామన్నారు. సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులతో పాటు గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. పథకాల అమలుకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డు సభలను నిర్వహించాలని సిఎం సూచించారు. లబ్ధిదారుల ఎంపికకు సేకరించిన వివరాలు, తయారు చేసిన జాబితాలను అక్కడే వెల్లడించాలన్నారు.
ఆ భూములకు రైతుభరోసా వద్దు..
గతంలో రైతుబంధు పేరిట భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని, గత ప్రభుత్వం వ్యవసాయ యోగ్యం కాని భూములకు పంట పెట్టుబడి సాయం అందించిందని ముఖ్యమంత్రి రేవంత్ గుర్తు చేశారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని హెచ్చరించారు. అధికారుల బృందాలు క్షేత్ర స్థాయికి వెళ్లి అనర్హులను గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాల కలెక్టర్లు లేవనెత్తిన సందేహాలను ముఖ్యమంత్రి నివృత్తి చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా చెల్లించాలని స్పష్టం చేశారు. వ్యవసాయానికి అక్కరకు రాని భూములను గుర్తించి, వాటిని మాత్రమే ఈ పథకం నుంచి మినహాయించాలన్నారు. రియల్ భూములు, లే ఔట్ భూములు, నాలా కన్వర్ట్ అయిన భూములు, మైనింగ్ భూములు, గోదాములు ఫంక్షన్ హాళ్లు నిర్మించిన భూములు, వివిధ ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు ప్రభుత్వం సేకరించిన భూములు ఈ అనర్హత జాబితాలోకి వస్తాయని సిఎం వారికి వివరించారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, డిటిసిపి లే ఔట్ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా ఈ జాబితాలను తయారు చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. విలేజ్ మ్యాప్‌లతో పాటు అధికారులు ఫీల్డ్‌కు వెళ్లి వాటిని ధ్రువీకరించుకొని వీటిని గ్రామ సభలో ప్రచురించాలని సిఎం చెప్పారు. రైతులకు ఎలాంటి అనుమానాలు అపోహలకు తావు లేదని, పంట వేసినా వేయకున్నా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి రైతు భరోసా అందుతుందని సిఎం స్పష్టత ఇచ్చారు. భూమి లేని నిరుపేద ఉపాధి కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించినట్లు సిఎం చెప్పారు. ఆ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేల నగదు సాయం అందిస్తామన్నారు. ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.
ఒక వ్యక్తికి ఒకేచోట రేషన్ కార్డు
గతంలో ఉన్న అర్హత నిబంధనల ప్రకారమే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని సిఎం తెలిపారు. ఒక వ్యక్తికి ఒకేచోట రేషన్ కార్డు ఉండాలని, ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో రేషన్ కార్డులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సిఎం ఆదేశించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వన్ రేషన్ వన్ స్టేట్ విధానాన్ని తీసుకురాబోతున్నామని ఆయన చెప్పారు. గూడు లేని నిరుపేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మంది వివరాలను జిల్లాలకు పంపించామన్నారు. అందులో అత్యంత నిరుపేదలుగా గుర్తించిన వారికి మొదటి ప్రాధాన్యమివ్వాలని సిఎం చెప్పారు. తొలి విడత నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశామని, ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారి జాబితాలను వెంటనే సిద్ధం చేయాలని సిఎం సూచించారు. జిల్లా ఇంచార్జ్ మంత్రుల ఆమోదంతో ఈ అర్హుల జాబితాను గ్రామసభల్లో ప్రచురించాలన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ లోగా ఈ పథకాల అమలుకు కావాల్సిన ప్రిపరేటరీ వర్క్ పూర్తి చేయాలని సిఎం సూచించారు. జిల్లా ఇన్ఛార్జీ మంత్రుల సారథ్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, నోడల్ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈనెల 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు.