Saturday, November 2, 2024

క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోండి ఇలా…

- Advertisement -
- Advertisement -

Credit Score Improve Tips in Telugu

న్యూఢిల్లీ : వినియోగదారులకు క్రెడిట్ స్కోరు ఎంతో ముఖ్యం, ఇది బ్యాంకు నుండి రుణం తీసుకోవడానికి చాలా సహాయకారిగా ఉంటుంది. క్రెడిట్ స్కోరు 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బ్యాంకులు సులభంగా రుణాలు ఇస్తాయి. కానీ కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మారటోరియం ముగియడంతో చాలా మంది బ్యాంక్ లోన్, క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఇది వినియోగదారుల క్రెడిట్ స్కోర్‌ను మరింత దెబ్బతీస్తోంది. 2020లో క్రెడిట్ స్కోర్‌లను తనిఖీ చేసే వారి సంఖ్య పెరిగిందని బ్యాంక్‌బజార్ తెలిపింది.

కరోనా సంక్షోభం కారణంగా క్రెడిట్ స్కోరు పడిపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కస్టమర్లు తమ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోవడానికి ఐదు మార్గాలు ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మొదట మీరు క్రెడిట్ స్కోర్‌ను సమీక్షించండి. ఎక్కడ మెరుగుపరచుకోవాలో చూడండి. క్రెడిట్ స్కోరు పొరపాటు ఉండటం సాధారణం. డేటా ఇచ్చేటప్పుడు బ్యాంకు పొరపాట్లు చేయడం వల్ల ఇలా వస్తుంది. కొన్నిసార్లు మీ పేరు మీద ఎవరైనా రుణం తీసుకొని రుణం తీసుకుంటారు. మీకు స్కోరులో ఏదైనా పొరపాటు ఉంటే, క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు చేసి దాన్ని సరిదిద్దుకోవాలి.

గత రికార్డుల సమీక్ష

గత రికార్డు సరిచేసేంతవరకు మీ క్రెడిట్ స్కోరు మెరుగుపడదు. రికార్డును మెరుగుపరచడానికి మునుపటి రికార్డును తప్పక సమీక్షించుకోవాలి. బ్యాంకు నుండి రుణం తీసుకొని తిరిగి చెల్లించినట్లయితే, ఆ రుణ ఖాతాను మూసివేయండి. అది మూసివేయకపోతే బ్యాంకుకు ఫిర్యాదు చేయండి. ఇలా చేయడం ద్వారా మీ క్రెడిట్ స్కోరు మెరుగుపడుతుంది.

తక్కువ క్రెడిట్ ఉపయోగించండి

ట్రాన్స్ యూనియన్ సిబిల్ నివేదికలో క్రెడిట్ వినియోగాన్ని తనిఖీ చేయాలి. ఆదర్శవంతంగా మీ క్రెడిట్ కార్డ్ పరిమితిలో 30 నుంచి -35% ఉపయోగించాలి. మీరు ఎక్కువ ఉపయోగించినట్లయితే దాన్ని కనీసం 50 శాతానికి తగ్గించడానికి ప్రయత్నించండి.

బహుళ రుణ దరఖాస్తులు

రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంక్ మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తుంది. రుణం కోసం మీరు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేస్తే, అది మీ క్రెడిట్ స్కోర్‌లో ప్రతిబింబిస్తుంది. మీ స్కోరు కొద్దిగా ప్రభావితమవుతుంది. మీరు త్వరగా దరఖాస్తు చేస్తే మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని బ్యాంక్ తెలుసుకుంటుంది. దీనిని నివారించడానికి ప్రయత్నించండి.

సురక్షిత రుణ ఎంపిక

ఆరోగ్యకరమైన ట్రాక్ రికార్డ్ సృష్టించడానికి సురక్షిత రుణ ఎంపికను ఎంచుకోండి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు మీరు క్రెడిట్ కార్డును కూడా పొందవచ్చు. సురక్షిత కాని రుణాలు వంటి వ్యక్తిగత రుణాలను వీలైనంత వరకు మానుకోండి. మీకు ఎక్కువ సురక్షిత కానీ రుణాలు ఉంటే బ్యాంకు లోన్ ఇవ్వడం మానేస్తుంది. మీరు రుణ వాయిదాలను చెల్లించడంలో ఆలస్యం చేస్తే మీ క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. అందువల్ల రుణ వాయిదాలను సకాలంలో చెల్లించాలి. అలాగే మీ క్రెడిట్ స్కోర్‌లో మీరు పాత రుణాలను తిరిగి చెల్లించినట్లు లేదా పరిష్కరించినట్లు ఉండాలి. సరైన సమయంలో రుణాన్ని తిరిగి చెల్లించినట్లు రుజువు ఉంటే, అప్పుడు రుణం సులభం అవుతుంది.

Credit Score Improve Tips in Telugu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News