Monday, December 23, 2024

క్రెడిట్ సూయిస్ కుప్పకూలబోతుందా?

- Advertisement -
- Advertisement -
క్రెడిట్ సూయిస్ గ్రూప్ ఏజి అనేది స్విట్జర్లాండ్ ఉన్న ప్రపంచ పెట్టుబడి బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ. పెట్టుబడి బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఆస్తి నిర్వహణ కార్యకలాపాలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు క్రెడిట్ సూయిస్ ముఖ్యమైనది. ఇది ఐరోపాలో ఆస్తులకు అప్పులిచ్చే 17వ అతిపెద్ద రుణదాత.

ముంబై: సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్‌విబి), సిగ్నేచర్ బ్యాంక్ పతనం తర్వాత ఇపుపడు స్విస్ పెట్టుబడి దిగ్గజం ‘క్రెడిట్ సూయిస్’ కుప్పకూలిపోయే స్థితిలో ఉందని మార్కెట్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్టాక్ ధర పతనం, పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడిని అది ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థలో పతనం ఏర్పడొచ్చు అన్న భయం ఉంది. ఇది క్రెడిట్ సూయిస్ ఖాతాదారులకు, పెట్టుబడిదారులకు భయాన్ని కలిగిస్తోంది. ఈ అమెరికా బ్యాంక్ పతనం అయితే దాని ప్రభావం భారతీయ బ్యాంకులపై ఉండనుందని సీనియర్ రీసెర్చ్ విశ్లేషకుడు హెర్ష్ సత్య వివరించారు.

ప్రస్తుతం క్రెడిట్ సూయిస్ వద్ద 8 బిలియన్‌ల స్విస్ ఫ్రాంక్‌లు ఉన్నాయి. 2022లో క్రెడిట్ సూయిస్ భారీగా నష్టపోయింది. ఆ బ్యాంకు దశాబ్ద కాలపు లాభం తుడిచిపెట్టుకుపోయింది. కానీ క్రెడిట్ సూయిస్‌కు ఇది కేవలం ఏడాది పాటు ఉండనున్న సమస్య. కానీ వారు ఈ సమస్యను పరిష్కరించడానికి గత ఐదు ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కొవిడ్‌కు ముందు నుంచి ఈ బ్యాంక్ స్టాక్ ధర 85 శాతం మేరకు పతనమైంది.

క్రెడిట్ సూయిస్ 2022లో రీస్టక్చరింగ్ చేపట్టింది. నాడు సౌదీ నేషనల్ బ్యాంక్‌లో 9.9 శాతం వాటాను పొందింది. అందుకు 4 బిలియన్‌ల స్విస్ ఫ్రాంక్స్ సేకరించింది. అయితే మార్చి 14న క్రెడిట్ సూయిస్ అంతర్గత నియంత్రణ విషయంలో బలహీనపడింది. దాంతో స్విస్ బ్యాంక్‌కు సమస్యలు మొదలయ్యాయి. స్విస్ నేషనల్ బ్యాంక్ కోసం 50 బిలియన్ స్విస్ ఫ్రాంక్ క్రెడిట్ లైన్‌ను తెరిచింది. దాంతో అది కాస్త రికవరీ అయింది. బ్యాంక్ డాలర్ బాండ్లు నిరంతరం పతనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూరొపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసిబి) తన బ్యాంకులన్నింటికీ దన్నుగా నిలబడతానని అన్నది. అంటే క్రెడిట్ సూయిస్ పతనం కాకుండా ఈసిబి చూడగలదని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News