Sunday, January 5, 2025

క్రెటా ఈవీని ఆవిష్కరించిన హ్యుందాయ్..

- Advertisement -
- Advertisement -

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఎట్టకేలకు తన క్రెటా EVని ఆవిష్కరించింది. ఇంతకుముందు ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి కంపెనీ టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, జనవరి 17 నుంచి జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కారును విక్రయానికి విడుదల చేయనున్నప్పటికీ ఈ కారు డిజైన్, స్పెసిఫికేషన్‌లను కంపెనీ ప్రదర్శించింది.

కొత్త హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ డిజైన్ ఇటీవల విడుదల అయినా ఫేస్‌లిఫ్టెడ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌ల ఆధారంగా రూపొందించారు. అయితే,కారు బాడీ ప్యానెల్స్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. కొత్త ఏరో ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్ ఇందులో
జోడించారు. క్రెటాకు పిక్సెల్-వంటి వివరాలతో కొత్త ముందు, వెనుక బంపర్‌లు ఇచ్చారు. క్రెటా ఎలక్ట్రిక్ యాక్టివ్ ఎయిర్ ఫ్లాప్‌తో అందించారు.

ఎలక్ట్రిక్ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్

ఈ ఎలక్ట్రిక్ కారులో డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్ సెటప్ అందుబాటులో ఉంది. ఇది కొత్త ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ డిజైన్‌ను పొందుతుంది. అంతేకాకుండా.. పనోరమిక్ సన్‌రూఫ్, వెహికల్ టు లోడ్ (V2L) టెక్నాలజీ, ADAS అలాగే డిజిటల్ కీ వంటి ఫీచర్లను జోడించారు. ఈ కారులో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 42kWH, 51.4kWH బ్యాటరీలు. ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌లు ARAI క్లెయిమ్ చేసిన 390 కిమీ, 473 కిమీ రేంజ్ ఇస్తాయి.

క్రెటా ఎలక్ట్రిక్ 7.9 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. క్రెటా ఎలక్ట్రిక్ మూడు డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. వీటిలో ఎకో, నార్మల్, స్పోర్ట్ ఉన్నాయి. స్టీరింగ్ కాలమ్ మౌంటెడ్ డ్రైవ్ మోడ్ సెలెక్టర్ కూడా కారులో ఇచ్చారు. కంపెనీ క్లెయిమ్ ప్రకారం.. క్రెటా ఎలక్ట్రిక్ కేవలం 58 నిమిషాల్లో (DC ఛార్జింగ్) 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News