Monday, December 23, 2024

క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇద్దరి అరెస్టు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పరారీలో ఉన్న క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ఇద్దరిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఈనెల 17వ తేదీన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం… క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఆరాంఘర్ వద్ద అరెస్టు చేశారు. సతీష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోగా ఖమ్మంకు చెందిన రవితేజ, ఎపిలోని విశాఖపట్టణానికి చెందిన మనోజ్, సతీష్‌తో కలిసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. రవితేజ జెఎన్‌టియూ వద్ద, మనోజ్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ వద్ద నివాసం ఉంటున్నారు. ముగ్గురు కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు.

దీనిలో భాగంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో బెట్టింగ్ నిర్వహించేందుకు వెళ్తుండగా సతీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న రవితేజ, మనోజ్ ఆదివారం బెట్టింగ్ నిర్వహించేందుకు వెళ్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,35,500ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News