హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. బెట్టింగ్‌ల పేరుతో కోట్లరూపాల చీకటి వ్యాపారం జరుగుతుంది. తాజాగా క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ గుజరాతి అరెస్ట్ అయ్యాడు. అమిత్ గుజరాతితో పాటు 20 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… అమిత్ క్రికెట్ బెట్టింగ్ తో క్యాసినో నిర్వహిస్తున్నాడు. గతంలో అమిత్ రెండు సార్లు అరెస్టయ్యాడు. నిందితుడు దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తున్నాడు. దేశవ్యాప్తంగా నెట్ వర్క్ కలిగి ఉన్న నిందితున్ని పిటి వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకురానున్నారు. ఇప్పటివరకు పోలీసులకు చిక్కకుండా అమిత్ తిరుగుతున్నాడు. దేశవ్యాప్తంగా బుకీలతో బెట్టింగులకు పాల్పడుతున్నాడు. గత కొన్నేళ్లుగా అమిత్ గ్యాంగ్ బెట్టింగులు నిర్వహిస్తూ కోట్లు కొల్లగొట్టారు. క్రికెట్ బెట్టింగుల కోసం వాడే లైవ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నాము. అమిత్ గుజరాతీని హాజరుపరుచనున్నామని పోలీసులు వెల్లడించారు.
క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ గుజరాతీ అరెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -