Wednesday, January 22, 2025

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

నల్గొండ  : నల్లగొండ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.12 కోట్ల నగదు, 2 కార్లు, 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. బుధవారం మిర్యాలగూడ 1 టౌన్ పరిధిలో మయూరినగర్ హౌసింగ్ బోర్డులోని ఫ్లాట్ నెం 303 సాయిదత్త అపార్ట్‌మెంట్‌లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు అయిన క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం ప్రకారం మిర్యాలగూడ I టౌన్ సి ఐ రాఘవేందర్, ఎస్‌ఐ శివ తేజ్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది,స్పెషల్ టీమ్ కట్టంగూర్ ఎస్‌ఐ విజయ్ కుమార్, మిర్యాలగూడ 2 టౌన్ ఎస్.ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ కొమ్ము రవి, రహిమాన్ సంయుక్తంగా అపార్ట్‌మెంట్లోకి ప్రవేశించి ఆన్‌లైన్ ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మొత్తం 9మందిని పట్టుకుని విచారించడం జరిగిందన్నారు.

మిర్యాలగూడ మయూరి నగర్‌కు చెందిన బంటు రాజేశ్(20), ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రానికి కోలసాయికుమార్(29), రాచబంతి జీవన్కుమార్(30), తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన నోట్ల సత్యనారాయణ(52), ఖమ్మం జిల్లాకు చెందిన శాకమూరి ఉదయ్‌కుమార్(34), మిర్యాలగూడ గాంధీనగర్‌కు చెందిన బంటు సంతోష్(29), గంధం నవీన్‌కుమార్(29), బంటు వంశీకృష్ణ(30) , ఖమ్మం జిల్లా ప్రకాశ్నగర్‌కు చెందిన కొండవేటి రాజేశ్(35)లను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో కీలక వ్యక్తి బంటు రాజేష్ కుమార్ గత మూడు సంవత్సరాలుగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌ను నిర్వహిస్తుండగా ఇతని టెలిగ్రామ్ యాప్ ద్వారా హార్దిక్ బుక్కీ ప్యానల్ నుండి మెయిన్ లైన్ యాక్సెస్‌ని తీసుకున్నాడని తెలిపారు.

Also Read: బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లడతా:ఈటల

ఈ లింకును తన బామ్మర్ది అయిన కోలా సాయికుమార్ ఫార్వర్డ్ చేసి ఈ యాప్ ద్వారా మొబైల్ ఫోన్స్ కు కనెక్ట్ చేసి ఆన్ లైన్‌లో చాలామందికి ఆన్లైన్ కమిషన్ ద్వారా ఈ కేసులో ఉన్న వారి సహాయంతో ఈ నెట్‌వర్క్ లో జాయిన్ చేసుకొని ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పెడుతూ సులువుగా డబ్బు సంపాదిస్తున్నాడన్నారు. రాజేశ్ ఇంట్లో కోలా సాయికుమార్, రాచకొండ జీవన్ కుమార్, నోట్ల సత్యనారాయణ, శాకమూరి ఉదయ్ కుమార్, బంటు సంతోష్, గందం నవీన్ కుమార్, బంటు వంశీకృష్ణ, కొండవీటి రాజేష్ లు సాయి దత్త అపార్ట్‌మెంట్ మయూరి నగర్ హౌసింగ్ బోర్డ్ నందు ఆన్ లైన్ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగాపోలీస్ అధికారులు, సిబ్బందిపట్టుకున్నారన్నారు. వీరిపైన గేమింగ్ యాక్టు కేసు నమోదు రిమాండ్ కి తరలించామన్నారు.

గతంలో రాజేష్ కుమార్ పైన క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా హైద్రాబాద్ లోని సరూర్ నగర్ పోలీసు స్టేషన్ లోనమోదైందన్నారు. కేసును చాకచక్యంగా మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి పర్యవేక్షనలో మిర్యాలగూడ 1 టౌన్ సి ఐ రాఘవేందర్,ఎస్.ఐ శివ తేజ, ఎస్.ఐ కట్టంగూర్ విజయ్ కుమార్, మిర్యాలగూడ 2 టౌన్ యస్.ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ గఫార్, కానిస్టేబుల్స్ కొమ్ము రవి హాలియా పి.యస్ , రహిమాన్, జి. హుస్సేన్, బి. వీరబాబు, ఎస్. వెంకటేశ్వర్లు, ఎం. సైదులును జిల్లా ఎస్పీ అపూర్వరావు అబినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News