పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2,10,000 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….రాజస్థాన్‌కు చెందిన జయేష్ రావత్ ముత్యాల వ్యాపారం చేస్తున్నాడు, హైదరాబాద్, ఉప్పుగూడకు చెందిన జె. రాహుల్ ప్రైవేట్ ఉద్యోగి, చత్రినాకకు చెందిన టి. నిఖిల్ ప్రైవేట్ ఉద్యోగి. రాజస్థాన్‌కు చెందిన జయేష్ రావత్ హైదరాబాద్‌లో ముత్యాల వ్యాపారం చేసేవాడు. వచ్చే డబ్బులు అవసరాలకు తీరకపోవడంతో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు.
ఐపిఎల్‌లో బెట్టింగ్ నిర్వహించేందుకు ప్రధాన బూకీలు ప్రకాష్, మోనును సంప్రదించాడు, వారు సఫైర్.కామ్ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధాన నిందితుడికి యూజర్ ఐడి, పాస్‌వర్డ్ ఇచ్చారు. రావత్ హైదరాబాద్‌కు చెందిన రాహుల్‌ను సబ్‌బూకీగా,నిఖిల్‌ను పంటర్‌గా నియమించుకున్నాడు. ముగ్గురు కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి ఐపిఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం చత్రినాఖ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు శ్రీశైలం, నరేందర్, నర్సింహులు, సీనయ్య తదితరులు పట్టుకున్నారు.