Monday, December 23, 2024

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Cricket betting gang arrested

ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రూ.55,000 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం

హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.55,000 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని జూబ్లీహిల్స్, వెంకటగిరి, కృష్ణానగర్‌కు చెందిన సంతోష్ హోటల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు, సికింద్రాబాద్, రెజిమెంటల్ బజార్‌కు చెందిన ప్రమోద్‌కుమార్ వ్యాపారం చేస్తున్నాడు. జీడిమెట్లకు చెందిన అనిరుద్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్‌కు చెందిన విక్టర్ అండ్రూస్ అరుల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు, స్వాతారపు శివకుమార్ పంటర్‌గా పనిచేస్తున్నాడు. బెట్టింగ్ ఆర్గనైజర్ సంతోష్ ఆదిలాబాద్ నుంచి బతుకు దెరువు కోసం నగరానికి పదేళ్ల క్రితం వచ్చాడు. అమీర్‌పేటలోని సాయిరాం కృష్ణ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే క్రికెట్ బెట్టింగ్‌ను ప్రారంభించాడు. మొదట్లో తక్కువ మొత్తంతో బెట్టింగ్ కట్టాడు. క్రమంగా బెట్టింగ్‌పై అవగాహన రావడంతో పంటర్లను నియమించుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. తెలిసిన, తెలియని వారి వద్ద నుంచి బెట్టింగ్ డబ్బులు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ సాయిఈశ్వర్ గౌడ్, డిఐ కోటయ్య, ఎస్సై అభిలాష్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News