Monday, December 23, 2024

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ ఎస్‌ఓటి, మియాపూర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1,96,000 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాతృశ్రీనగర్ ప్రాంతంలో క్రాంతి కుమార్, విజయ భాస్కర్, సమీర్ పిరానీ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

ప్రధాన నిందితుడు సత్తాని అలియాస్ రాజ్‌కుమార్ వద్ద నుంచి యాప్‌కు సంబంధించిన యూజర్ ఐడి, పాస్‌వర్డ్ తదితరాలను తీసుకున్నారు. ఇక్కడ ఆసక్తి ఉన్న వారి వద్ద నుంచి బెట్టింగ్‌కు ఆహ్వానిస్తున్నారు. నిందితులు బెట్టింగ్‌కు సంబంధించిన నగదును బ్యాంక్ ద్వారా తీసుకుంటున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News