Monday, December 23, 2024

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. అరెస్టైన వారి వద్ద నుంచి రూ.12,05,000 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, బర్కత్‌పురాకు చెందిన వికాస్ అగర్వాల్, గుజరాత్‌కు చెందిన మహేంద్ర పటేల్, రాజేంద్ర పటేల్, మరో ఏడుగురు పంటర్లు కలిసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధాన నిందితుడు వికాస్ అగర్వాల్ హార్స్ రేసింగ్ బూకీగా పనిచేసేవాడు.

ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. దీనికి గాను ఆన్‌లైన్ అప్లికేషన్ల కోసం మహారాష్ట్రకు చెందిన సాగర్‌ను కాంటాక్ట్ అయ్యాడు. దాని ద్వారా రాధే ఎక్సెంజ్ నుంచి యూజర్‌ఐడి, పాస్‌వర్డ్‌లను తీసుకున్నాడు. తర్వాత రాజేంద్ర పటేల్, మహేంద్రపటేల్‌ను కాంటాక్ట్ చేశాడు. వారితో కలిసి పంటర్ల ద్వారా డబ్బులను కలెక్ట్ చేస్తున్నాడు. న్యూజీలాండ్, ఇండియా మధ్య అహ్మదాబాద్‌లో జరగనున్న టి20 మ్యాచ్‌కు ఆసక్తి ఉన్న వారి వద్ద నుంచి బెట్టింగ్ డబ్బులు తీసుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News