Tuesday, November 19, 2024

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -
cricket betting gang arrested in hyderabad
రూ.1,13,500 నగదు,
నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం

హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్, బేగంబజార్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,13,500 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని బేగంబజార్‌కు చెందిన ఆశిష్ దన్వార్, వైభవ్ గుప్తా వ్యాపారం చేస్తున్నారు, కాచిగూడకు చెందిన ఆనంద్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆశిష్ దన్‌వార్ ప్రధాన బూకీ వికాష్ తోసావాడ్ తరఫున ఇక్కడ సబ్ బూకీగా పనిచేస్తున్నాడు. ఐపిఎల్ ప్రారంభం కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో బెట్టింగ్ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. పంటర్లు, సబ్‌బూకీలు, కలెక్షన్ ఏజెంట్లను నియమించుకున్నాడు. బెట్టింగ్‌లో పాల్గొనే వారికి www.appleexch.com ద్వారా యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను ఇస్తున్నాడు. బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాటన్ లాడ్జీలో రూమ్‌నంబర్408లో అన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడి నుంచి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. లక్నో సూపర్ గేయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు అశోక్ రెడ్డి, అనంత చారి, అరవింద్ గౌడ్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News