Friday, December 20, 2024

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. రూ. 50లక్షల నగదు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఐపిఎస్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. 12 మంది సభ్యుల క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. పెట్ బషీరాబాద్ లో 12 మందిని గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్ వోటీ పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ. 50 లక్షల నగదు, 8 ల్యాప్ ట్యాప్స్, 63 ఫోన్లు, ఐప్యాడ్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపిఎల్ సజీన్ ప్రారంభం అయినప్పటీ నుంచి నగరంలో భారీగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News