Sunday, December 22, 2024

క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు.. ముగ్గురు నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1.50 లక్షల నగదుతో పాటు రెండు ల్యాప్‌టాప్‌లు, 5 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్ తెలిపిన వివరాల ప్రకారం దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఉదయ్‌సింహా రెడ్డి, మహ్మద్ ఫహీముద్దీన్, భానుప్రసాద్ స్నేహితులు. చేస్తున్న పనుల నుంచి ఆశించిన ఆదాయం రాకపోతుండటంతో ముగ్గురు కలిసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిం చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెండు వెబ్‌సైట్ల నుంచి బెట్టింగ్ యాప్ ఐడీ, పాస్‌వర్డులను సేకరించారు. వీటిని ల్యాప్‌టాప్‌లో అప్‌లోడ్ చేసి క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడ్డారు.

లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీలో భాగంగా న్యూయార్క్ సూపర్‌స్టార్స్, రాజస్థాన్ కింగ్స్ జట్ల మధ్య పల్లెకిలె అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి సుల్తాన్‌బజార్ స్టేషన్ పరిధిలోని స్వీకార్ హోటల్ వద్ద ముగ్గురు కలిసి బెట్టింగులు స్వీకరి స్తుండగా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ సీఐ ఎన్.రామకృష్ణ, ఎస్‌ఐ నవీన్‌కుమార్‌తో పాటు సిబ్బందితో కలిసి దాడి చేసి అరెస్ట్ చే శారు. విచారణలో నిందితులు గూగుల్‌పే, ఫోన్‌పే యాప్‌ల ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లుగా తేలింది. కొన్నిసార్లు భానుప్రసాద్ నేరుగా బెట్టింగులు కట్టిన వారి వద్దకు వెళ్లి నగదును తీసుకు వచ్చేవాడని వెల్లడైంది. ముగ్గురు నిందితులపై కేసులు నమోదు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు తదుపరి దర్యాప్తు, విచారణ నిమిత్తం వారిని సుల్తాన్ బజార్ పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News