Monday, March 31, 2025

క్రికెట్ బెట్టింగ్… యువకుడి ప్రాణాలు కాపాడిన సెల్ ఫోన్ లైంటింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి క్రికెట్ బెట్టింగ్ లో సర్వం కోల్పోయాడు. స్నేహితులు వద్ద అప్పు చేసి మరి క్రికెట్ బెట్టింగ్ లో పాల్గొన్నాడు. అప్పులు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోయాడు. తన సోదరికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపారు. పట్టాలపై సెల్ ఫోన్ వెలుగు కనిపించడంతో అతడిని రైల్వే పోలీసులు కాపాడారు. ఈ సంఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఎస్ఆర్ నగర్ లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. నెల రోజుల క్రితం ఉద్యోగం మానేసి క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడ్డాడు. అప్పులు చేసి క్రికెట్ బెట్టింగ్ లో మూడు లక్షలు కోల్పోయాడు.

అప్పులు ఇచ్చిన వారు డబ్బులు అడుగుతుండడంతో ముఖం చాటేశాడు. జీవితంపై విరక్తి చెంది సదరు యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో వెళ్లి రైలు పట్టాలు పడుకొని తన సోదరికి ఫోన్ చేశాడు. క్రికెట్ బెట్టింగ్ లో మూడు లక్షల రూపాయలు పోయాయని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. సోదరి డబ్బు చెల్లిస్తానని చెప్పింది. అప్పుడే రైల్వే పోలీసులు అక్కడి నుంచి వెళ్తుండగా సెల్ ఫోన్ లైటింగ్ కనిపించడంతో దగ్గరకు వెళ్లాడు. పట్టాలపై పడుకొని మాట్లాడుతున్న యువకుడిని గమనించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని స్టేషన్ కు తరలించారు. కుటుంబ సభ్యులతో పాటు యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News