- Advertisement -
హైదరాబాద్: క్రికెట్ అభివృద్ధే తన ధ్యేయమని టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంబుడ్స్‌మెన్‌గా దీపక్ శర్మ నియమితులయ్యారు. హెచ్‌సిఎ వార్షిక సర్వసభ్య సమావేశంలో అజారుద్దీన్ మాట్లాడారు. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం 20 శాతం నిధులు కేటాయించామని, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మైదానాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది స్వలాభం కోసం తాను ఏమీ చేసినా అడ్డుపడాలని చూస్తున్నారని మండిపడ్డారు. హెచ్‌సిఎం గొడవలపై బిసిసిఐ సీరియస్‌గా ఉందన్నారు. ఎజిఎం కావాలనే గొడవ చేసిన వారికి షోకాజ్ నోటీసులు ఇస్తామని, అవసరమైతే వారిని సస్పెండ్ చేస్తామన్నారు. అంబుడ్స్‌మెన్ నియామకం విషయంలో స్టేజ్ పైన మాజీ క్రికెటర్ అజారుద్దీన్, విజయానంద్ గొడవ పడిన విషయం తెలిసిందే.
- Advertisement -