Wednesday, January 22, 2025

ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు

- Advertisement -
- Advertisement -

ఐఓసి కీలక నిర్ణయం

ముంబై: ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన క్రీడల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న క్రికెట్‌కు ఒలింపిక్స్‌లోనూ చోటు దక్కింది. విశ్వ క్రీడల్లో క్రికెట్‌కు చోటు కల్పించేందు కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమో దం తెలిపింది. 2028లో అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించారు. ఈ విషయాన్ని ఐ ఓసి శుక్రవారం ట్వీట్ ద్వారా వెల్లడించిం ది. ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో క్రికెట్‌కు విపరీత ఆదరణ లభించిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒలింపిక్స్‌లోనూ చోటు కల్పించాలని ఐఓసి నిర్ణయించింది. టి20 ఫార్మాట్‌లో క్రికెట్ పోటీ లు జరుగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News