Saturday, November 16, 2024

వార్మప్ మ్యాచ్‌లు వర్షార్పణం

- Advertisement -
- Advertisement -

భారత్‌xకివీస్, పాక్‌xఅఫ్గాన్, బంగ్లాxసఫారీ మ్యాచ్‌లు రద్దు

 

బ్రిస్బేన్ : టి20 ప్రపంచకప్‌నకు ముందు జరగాల్సిన చివరి మూడు వార్మప్ మ్యాచ్‌లు వర్షం వ ల్ల అర్ధాంతరంగా రద్దయ్యాయి. భారత్‌న్యూజిలాండ్, పాకిస్థాన్‌అఫ్గానిస్థాన్, సౌతాఫ్రికాబంగ్లాదేశ్ జట్ల మధ్య బుధవారం వార్మప్ మ్యాచ్‌లు జరగాల్సిం ఉంది. అయితే భారీ వర్షం కారణం గా మూడు మ్యాచ్‌లు కూడా రద్దు చేయక తప్పలేదు. పాకిస్థాన్‌అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో తొలి ఇ న్నింగ్స్ పూర్తి కాగా, రెండో ఇన్నింగ్స్ మధ్యలో వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ అక్కడే నిలిచి పోయింది. ఇక భారత్‌కివీస్, బంగ్లాదేశ్‌సౌతాఫ్రికా మ్యాచ్‌లు అయితే కనీసం టాస్ కూడా వే యకుండానే రద్దు చేయాల్సి వచ్చింది. కుంభవృ ష్ఠి కురవడంతో మైదానం మొత్తం చిత్తడిగా మా రింది. ఈ స్థితిలో కనీసం టాస్ వేసే పరిస్థితి కూ డా లేకుండా పోయింది.

షాక్ లాంటిదే..

మరోవైపు ప్రపంచకప్ సూపర్12కు జరగాల్సి న ప్రాక్టీస్ మ్యాచ్ వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడం భారత్‌కివీస్ జట్లకు పెద్ద షాక్‌లాంటిదేనని చెప్పాలి. సౌతాఫ్రికాతో జరిగిన కిందటి వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. ఇక భారత్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి వరల్డ్‌కప్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావించిన కివీస్‌కు నిరాశే ఎదురైంది. ఇక టీమిండియా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన కిందటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన టీమిండియా కివీస్‌తో పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది.

అ యితే వర్షం భారత ఆశలపై నీళ్లు చల్లింది. జట్టు లోపాలను సరిదిద్దుకునేందుకు ఈ మ్యాచ్‌ను వాడుకోవాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భావించాడు. సీనియర్ బౌలర్ మహ్మద్ షమి ఈ మ్యాచ్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించినా ఫలితం లేకుండా పోయింది. ఇక చివరి వార్మప్ మ్యాచ్ రద్దు కావడంతో ఇక టీమిండియా నేరుగా సూపర్12 బరిలోకి దిగనుంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ ప్రపంచకప్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక యుఎఇ వేదికగా జరిగిన కిందటి వరల్డ్‌కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ సంచలన విజయం సాధించింది. మరోవైపు టీమిండియా ఈసారి ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. కీలక ఆటగాళ్లు జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు గాయాల కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యారు. ఇది ఒకటే టీమిండియాను కాస్త కలవరానికి గురిచేస్తోంది. అయితే షమి, భువనేశ్వర్, హర్షల్, అర్ష్‌దీప్, చాహల్, అశ్విన్ తదితరులతో భారత బౌలింగ్ బలంగానే ఉంది. అంతేగాక కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ వంటి మ్యాచ్ విన్నర్లు టీమిండియాకు అందుబాటులో ఉన్నారు. దీంతో ఈ వరల్డ్‌కప్‌లో భారత్ కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News