Thursday, January 9, 2025

అతి పిన్న వయసులో గ్రేట్ రికార్డు: సల్మాన్ భట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ చేసిన టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్‌పై ప్రశంసల జల్లు కురుస్తుంది. అతి పిన్న వయస్సులో గిల్ డబుల్ సెంచరీ చేశాడు. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ 149 బంతుల్లో 208 పరుగులు చేయడంతో భారత జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. క్రికెట్‌కు గిల్ లాంటి ఆటగాడు అవసరమని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తెలిపాడు. భట్ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడారు. గిల్ బ్యాటింగ్ తీరుకు ముగ్దుడయ్యానని ప్రశంసించాడు. గత సంవత్సరం జరిగిన ప్రపంచ టెస్టు చాంఫియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో గిల్ ఆట తీరు చూశాక అతడికి అభిమానిగా మారిపోయానని, బ్యాటింగ్ విధానం, స్టైల్ బాగుందని భట్ కితాబిచ్చాడు.

గిల్ ఎందుకు భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడని తనలో కొంచెం అనుమానం ఉండేందని, తాజాగా న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ చేశాక, అనుమానం పటాపంచలైందన్నాడు. నిలకడగా కష్టపడుతూ ఆడితే మాత్రం అతడు ఉన్నత శిఖరాలకు వెళ్లడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. సహచర బ్యాట్స్‌మెన్లు విఫలం చెంది మైదానం వీడుతుంటే మొక్కవోని దీక్షతో పరుగు పరుగు రాబడుతూ గొప్ప ఇన్నింగ్స్ ఆడారన్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రారంభంలో అతడు నెమ్మదిగా ఆడి చివరలో దూకుడు పెంచాడని కొనియాడారు. ప్రముఖ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మార్క వా, సయ్యద్ అన్వర్, జాక్వస్ కలీస్ ప్రారంభంలో నెమ్మదిగా ఆడి చివరలో వీర విజృంభణ చేసేవారని గుర్తు చేశారు. ఇలాగే గిల్ బ్యాటింగ్ కొనసాగిస్తే ప్రముఖ క్రికెటర్లలో ఒకడిగా నిలుస్తాడన్నారు. అతి పిన్న వయస్సులో చివరలో గేమ్ గ్రేట్‌గా ముగించాడన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News