Monday, December 23, 2024

క్రికెట్‌కు మురళీ విజయ్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

చెన్నై: భారత స్టార్ ఓపెనర్ మురళీ విజయ్ అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని విజయ్ సోమవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. 2002 నుంచి 2018 వరకు మురళీ భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నా అతనికి టీమిండియాలో చోటు దక్కడం లేదు. దీనిపై కొంతకాలం క్రితం మురళీ సెలెక్టర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.

కాగా, 16 ఏళ్ల కెరీర్‌లో విజయ్ టెస్టుల్లో మెరుగైన ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 61 టెస్టులు ఆడి 3982 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, మరో 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 17 వన్డేలు, 9 టి20లలో కూడా మురళీ విజయ్ బరిలోకి దిగాడు. ఐపిఎల్‌లో చాలా రోజుల పాటు చెన్నైకు ప్రాతినిథ్యం వహించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News