Sunday, December 22, 2024

బిజెపిలో చేరిన క్రికెటర్ జడేజా

- Advertisement -
- Advertisement -

ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా బిజెపిలో చేరారు. దీనితో తన రాజకీయ జీవితం ఆరంభమవుతుందని గురువారం ఆయన ప్రకటించారు. బిజెపి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో ఈ క్రికెటర్ తాను బిజెపి సభ్యుడిగా చేరిన కార్డును సోషల్ మీడియాలో పొందుపర్చారు. రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఇప్పుడు గుజరాత్ నుంచి బిజెపి ఎమ్మెల్యేగా ఉన్నారు. భర్తతో తాను కలిసి ఉన్న ఫోటోను, ఆయన బిజెపి సభ్యత్వ కార్డు ఫోటోను రివాబా షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె జామ్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News