Sunday, January 19, 2025

క్రికెటర్ త్రిషాకు ఘన సన్మానం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: టీమిండియా మహిళా క్రికెటర్ త్రిషా రెడ్డికి శనివారం హైదరాబాద్‌లో ఘన సన్మానం జరిగింది. రిజెన్సీ కాలేజ్ ఆఫ్ కలినరీ ఆర్ట్ అకాడమీ వార్షికోత్సవ వేడుకలకు త్రిషా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా త్రిషా రిజెన్సీ కళాశాల విద్యార్థులతో ముచ్చటించింది. ఈ క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ రెడ్డి త్రిషాను ఘనంగా సత్కరించారు. కఠోర సాధన, ఆటపై ఉన్న అంకితభావం వల్లే త్రిషా టీమిండియాలో చోటు సంపాదించిందని ప్రిన్సిపాల్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కళాశాల హెచ్‌ఓడి ఉమాబాల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also read: హిట్‌తో మొదలుపెట్టి.. ఫ్లాప్‌తో కనుమరుగైన దర్శకులు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News