Monday, April 21, 2025

ఎ కేటగిరిలో పంత్… బి కేటగిరిలో శ్రేయస్ అయ్యర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సెంట్రల్ కాంట్రాక్ట్‌కు ఎంపికైన క్రికెటర్ల జాబితాను బిసిసిఐ విడుదల చేసింది. ఎ ప్లస్ కేటగిరిలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, రవీంద్ర జడేజాలు ఉన్నారు. ఎ కేటగిరిలో సిరాజ్, కెఎల్ రాహుల్, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్‌లు ఉన్నారు. రిషబ్ పంత్‌ను బి కేటగిరి నుంచి ఎ కేటగిరిలోకి బిసిసిఐ మార్చింది. గత సంవత్సరం కాంట్రాక్టు దక్కని శ్రేయస్ అయ్యర్‌కు బి కేటగిరిలో చోటు కల్పించారు. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్‌లు ఉన్నారు. సి కేటగిరీలో తిలక్ వర్మ, రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శామ్సన్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News