Thursday, January 23, 2025

ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ

- Advertisement -
- Advertisement -

యైటింక్లయిన్‌కాలనీ : ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలు నియంత్రణ చేయవచ్చని, శాంతి భద్రతల పరిరక్షణ, సెన్సాఫ్ సెక్యూరిటి కల్పించడానికై కమ్యూనిటి ప్రోగ్రాంను నిర్వహిస్తున్నామని గోదావరిఖని టూటౌన్ సిఐ సూరం వేణుగోపాల్ అన్నారు. రామగుండం సిపి రెమా రాజేశ్వరీ, డిసిపి వైభవ్‌గైక్వాడ్, ఏసిపి గిరిప్రసాద్ మేరకు వెంకట్రావ్‌పల్లి గ్రామపంచాయితి పరిధిలోని కెకెనగర్‌లో అకస్మిక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామం నిర్వహించి ఇళ్లను సోదా చేశారు.

ఈ సందర్భంగా 55 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, ఒక ట్రాక్టర్ సీజ్ చేసి సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గ్రామంలోకి కొత్త వ్యక్తులు షెల్టర్ తీసుకుంటే సమాచారం ఇవ్వాలన్నారు. ఇళ్లకు అద్దె కొసం వస్తే ఆధార్ కార్డు చూడాలని, అనుమానం వస్తే పోలీసులకు తెలుపాలన్నారు. హెల్మెట్ దరించాలని, ధృవపత్రాలు ఉండాలని, ఇన్సురెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.

ఆపద వస్తే 100కు డయల్ చేయాలన్నారు. ప్రజల రక్షణకై నిత్యం అందుబాటులో ఉంటామన్నారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని, తెలియని మెసెజ్‌లు ఓపెన్ చేయవద్దు అన్నారు. మోసపోయిన పక్షంలో 1930కి డయల్ చేయాలన్నారు. మోబైల్ పోగొట్టుకున్న వారు సిఇఐఆర్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసుకోవాలన్నారు. మహిళలకు ఆపద వస్తే షీటీంను ఆశ్రయించాలన్నారు. కార్యక్రమంలో సిఐ అఫ్జలుద్దీన్, ఎస్‌ఐలు ఎం చంద్రశేఖర్, ఫరీద్, కమాన్‌పూర్ ఎస్‌ఐ బేతి రాములు, రెండు స్టేషన్ల సిబ్బంది పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News