Sunday, December 22, 2024

నేరాల సంఖ్య ఈ ఏడాది తగ్గుముఖం

- Advertisement -
- Advertisement -

శాంతి భద్రతల పరిరక్షనే ధ్యేయం
ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం..
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి

మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వచ్చే కొత్త సంవత్సరంలో కూడా శాంతి భద్రతలను పరిరక్షి ంచేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తు.చ. తప్పకుండా అమలు చే స్తామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శుక్రవారం టౌన్ పో లీసు స్టేషన్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గత ఏడాది నేరాల అదుపుకోసం చేపట్టిన పోలీసింగ్ సేవలను వివరించారు.

ఈ ఏడాది డిసెంబర్ 15 నాటికి జిల్లాలో 3022 కేసులు న మోదు కాగా 2020లో 3156 కేసులు నమోదైయ్యాయని తెలిపారు. గత ఏడాది కంటే 2021లో కేసుల నమోదు 4.24 శాతం తగ్గుముఖం పట్టాయన్నారు. కోర్టుల్లో 1776 కేసులు పరిష్కారం అయ్యాయని 736 కేసుల్లో నిందితులకు కోర్టు శిక్ష విధించినట్లు తెలిపారు. కోర్టులో విచారణ జరిగిన కేసుల్లో 41.44శాతం కేసుల్లో నిందితులకు శిక్షపడిందన్నారు. ప్రాపర్టీ కేసుల్లో గత ఏడాది 158 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 121మాత్రమే నమోదు ఆయ్యాయని పేర్కోన్నారు.

హత్య కేసులు 22 నమోదు అయ్యాయని, చోరీల కేసులు 121 నమోదు కాగా వాటిలో 58 కేసుల్లో నిందితులనుపట్టకుని ప్రాపర్టీ రికవరీ చేసినట్లు తె లిపారు. చీటింగ్ మ169 కేసులు నమోదైయ్యాయని పేర్కోన్నారు. 63 కిడ్నాప్ కేసులు, హత్యాయత్నా లు 59, రోడ్డుప్రమాదాలు 250, ఇతర నేరాలు 686, మహిళల కు వ్యతిరేకంగా 388, హత్యాచారాల కేసులు 120, రేప్ కే సు లు 32, వరకట్న మృతి కేసులు 4 నమోదు అయ్యాయని పేర్కోన్నా రు. రోడ్డు ప్రమాదాల సంఘటన లు 250 జరుగ్గా 131మంది మృ త్యువాత పడగా 291 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని ఎస్పీ వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 602 నమోదు కాగా 17 మందికి శిక్షపడగా రూ. 39,2 50 జరిమానాలుగా వసూ లు చేసినట్లు తెలిపారు.గం జా యి, గుట్కా అక్రమ రావాణా చేస్తున్న వా రిపై కూడా కేసులు నమోదుచేసి నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు.

వచ్చే ఏడాదిలో కూడా చట్టానికి లోబడి ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలు ఎ ంతటి వారు చేసినా పోలీసులు చూసి ఊరుకోరని స్పష్టం చేశారు. శా ంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు చిత్తశుద్దితో పనిచేస్తారని వివరించారు. తనకు కూడా నేరుగా బాధితులు తమ సమస్యలు విన్నవి ంచుకోవచ్చునని, లేదా డీఎస్పీలు కూడా అందుబాటులో ఉంటారని వా రికి కూడా తమ గోడును వినిపించవచ్చునని ఎస్పీ సూచించారు. ఈ వి లేకరుల సమావేశంలో మహబూబాబాద్, తోర్రూరు, ఏఆర్ డీఎస్పీలు పి.సదయ్య, వెంకటరమణ, రేలా జనార్థన్‌రెడ్డి, సీఐలు జూపల్లి వెంకటరత్నం, సుంకరి రవికుమార్, సాగర్, వెంకటేశ్వర్‌రావు, ఎస్సైలు వెంక న్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News