Monday, December 23, 2024

2 శాతం నేరాలు పెరిగాయి: సిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 2022తో పోలిస్తే ఈ ఏడాది 2 శాతం నేరాలు పెరిగాయని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగిన నేరాలపై వార్షిక నివేదకను సిపి శ్రీనివాస రెడ్డి విడుదల చేశారు. స్థిరాస్తి నేరాలు మూడు శాతం పెరిగాయని, ఈ ఏడాదిలో మహిళలపై నేరాలు పెరిగాయని, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరిస్తున్నామని, పొక్సో కేసులు 12 శాతానికి తగ్గాయని, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల కన్నా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు పెరిగాయని సిపి వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీపై నిపుణులను పిలిచి అవగాహన కల్పించామని, ఈ ఏడాది అన్ని పండుగలు, ర్యాలీలు ప్రశాంతంగా నిర్వహించామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించామని, ట్రాఫిక్‌లో కూడా త్వరలో మరికొన్ని పిఎస్‌లు వస్తాయని సిపి తెలియజేశారు. దేశంలో తొలిసారిగా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని, నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేసుకున్నామని, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో సదస్సులు నిర్వహించామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News