Wednesday, January 22, 2025

2022లో మహిళలపై పెరిగిన నేరాల సంఖ్య ఎంతో తెలుసా? : ఎన్‌సిబి నివేదిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 2022 లో దేశం మొత్తం మీద మహిళలపై నమోదైన నేరాల సంఖ్య 4.45 కు చేరిందని, 2020 లో ఈ సంఖ్య 3,71,503 కాగా, 2021లో 4,28,278 వరకు ఉందని,దీన్ని బట్టి నేరాల సంఖ్య పెరిగినట్టు స్పష్టమవుతోందని నేషనల్ క్రైమ్ రిపోర్టు బ్యూరో ( ఎన్‌సిబి )తాజా నివేదిక వెల్లడించింది. దాదాపు ప్రతిగంటకు 51 కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. లక్ష జనాభాకు 66.4 శాతం వంతున ఈ క్రైమ్ రేటు ఉంటోందని, అలాంటి కేసుల్లో నమోదు 75.8 శాతం వరకు ఉందని నివేదిక పేర్కొంది.

భర్త, అతని తాలూకు కుటుంబ సభ్యుల వల్లనే నేరాలు 31.4 శాతం వరకు ఉంటున్నాయి. కిడ్నాపింగ్, నిర్బంధించడం కేసులు 19.2 శాతం, దౌర్జన్యాలు 18.7 శాతం, అత్యాచారాలు 7.1 శాతం వరకు నేరాల రేటు ఉంటోందని నివేదిక వివరించింది. గత ఏడాది దేశంలో 28,522 హత్య కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ప్రతిరోజు సగటున 78 లేదా ప్రతిగంటకు మూడుకు పైగా హత్యలు జరిగాయి.

రాష్ట్రాల వారీగా హత్యకేసుల నమోదులో ఉత్తరప్రదేశ్ టాప్‌లో ఉంది.ఆ రాష్ట్రంలో 2022లో అత్యధికంగా 3491 హత్య కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత బీహార్ (2930), మహారాష్ట్ర (2295),మధ్యప్రదేశ్ (1978), రాజస్థాన్ (1834), ఉన్నాయి. మొత్తం మీద నమోదైన కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలో నమోదయ్యాయని నివేదిక పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News