Wednesday, January 22, 2025

హీరో రానా, సురేష్ బాబుపై క్రిమినల్ కేసు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా మీద క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో ఫిలింనగర్ లాండ్ వివాదంలో కొత్త మలుపు తిరిగింది. దౌర్జన్యంగా తమను రౌడీల సాయంతో ఖాళీ చేయించారు అని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి ఫిర్యాదు చేశారు. ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించినట్లు బాధితుడు వాపోయాడు.
ఫిర్యాదు చేసినా బంజారా హిల్స్ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించాడు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. పోలీసులతో సంబంధం లేకుండా నేరుగా సురేష్ బాబు, దగ్గుబాటి రానాతో సహా మరి కొంతమందిపై నాంపల్లి కోర్టు కేసు నమోదు చేసింది. విచారణకు రావాలని ప్రముఖ సినీ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా సమన్లు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News