Monday, December 23, 2024

ఎంపి కెకె కుమారుల మీద క్రిమినల్ కేసు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజ్య సభ ఎంపి కె. కేశవరావు కుమారుల మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఫోర్జరీ సంతకాలతో ఎన్‌ఆర్‌ఐ మహిళకు చెందిన స్థలం కబ్జా చేశారనే ఆరోపణలతో ఎంపి కెకె కుమారులు విప్లవ్ కుమార్, వేంకటేశ్వర రావు మీద పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నెల క్రితమే వీరి మీద కేసు నమోదు కాగా, ఈ విషయం బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డట్టు సమాచారం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13 లో నివసించే జయమాల… కెకె కుమారులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లినా ఫలితం లేకపోవడంతో ఇటీవల మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌ని ఆశ్రయించారు. ఆ తర్వాత న్యాయస్థానం ఆదేశాలతో గత నెల 13న పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో కేశవరావు కుమారులు విప్లవ్ కుమార్‌ని ఎ1 గా, వెంకటేశ్వర్‌రావును ఎ2 గా చేర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News